Jagan: 10 మంది బృందంతో ఢిల్లీకి బయల్దేరిన జగన్

Jagan leaves to Delhi amid speculations on joining Union Cabinet
  • విజయవాడ నుంచి ఢిల్లీకి బయల్దేరిన జగన్
  • ఇప్పటికే ఖరారైన మోదీ అపాయింట్ మెంట్
  • మోదీ తో పలు అంశాలపై చర్చించనున్న జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ ఉదయం పులివెందులలో తన మామ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో జగన్ పాల్గొన్నారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం నేరుగా ఢిల్లీకి బయల్దేరారు. జగన్ తో పాటు 10 మంది బృందం ఢిల్లీకి పయనమైంది. రేపు నదీ జలాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి సంబంధిత అధికారులకు జగన్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.

మరోవైపు ప్రధాని మోదీని కలిసేందుకు జగన్ కు అపాయింట్ మెంట్ ఖరారైంది. మోదీతో సమావేశం సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై జగన్ చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో జగన్ భేటీ కానున్నారు. మరోవైపు కేంద్ర కేబినెట్ లోకి వైసీపీ చేరబోతోందనే వార్తలతో జగన్ పర్యటన మరింత ఆసక్తికరంగా మారింది.
Jagan
YSRCP
Delhi
Narendra Modi
BJP

More Telugu News