అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకునే యోచనలో వంశీ.. జగన్ ను కలిసేందుకు యత్నం!
- గన్నవరం వైసీపీలో ముదురుతున్న వర్గపోరు
- వంశీని వ్యతిరేకిస్తున్న దుట్టా, యార్లగడ్డ
- హైకమాండ్ కూడా పట్టించుకోవడం లేదనే బాధలో వంశీ
జరుగుతున్న పరిణామాలను పార్టీ హైకమాండ్ కూడా చూసీచూడనట్టు వదిలేయడంతో ఆయన మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి జగన్ ను కలవాలని వంశీ నిర్ణయించారు. అవసరమైతే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకునే యోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు, తాము జగన్ నాయకత్వంలో పని చేస్తున్నప్పటికీ తమపై దుష్ప్రచారం చేస్తున్నారని వంశీ వర్గీయులు కూడా అసహనంగా ఉన్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో గన్నవరం వైసీపీలో ఏం జరగబోతోందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.