కేంద్ర కేబినెట్ లోకి వైసీపీ? సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్న జగన్!
- కేంద్ర కేబినెట్లో వైసీపీ చేరుతోందని ఢిల్లీలో పెద్ద చర్చ
- 2 కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవులను ఆఫర్ చేసినట్టు సమాచారం
- మోదీతో పలు విషయాలపై చర్చించనున్న జగన్
మరోవైపు పలు విషయాలపై మోదీతో జగన్ చర్చించబోతున్నారు. ఇందులో ప్రధానంగా శాసనమండలి రద్దు అంశం కూడా ఉన్నట్టు సమాచారం. దీంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ నిధులు, పోలవరం ప్రాజెక్టు నిధులు తదితర అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. మరోవైపు కేంద్ర కేబినెట్లోకి వైసీపీ చేరితే రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తీసుకునే అవకాశం ఉన్నాయి. బీజేపీతో కలిసి నడుస్తున్న జనసేన పార్టీ వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ పరిణామం పట్ల జనసేన ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.