కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యాక అస్వస్థత.. బీజేడీ ఎమ్మెల్యే కన్నుమూత
- గత నెల 14న కొవిడ్ బారినపడిన ఎమ్మెల్యే
- పిపిలి నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
- వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృతి
1985లో తొలిసారి జనతాదళ్‌లో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రదీప్ మహారథి ఇప్పటి వరకు ఏడుసార్లు విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. 2000వ సంవత్సరంలో నవీన్ పట్నాయక్ సారథ్యంలో ఏర్పాటైన బిజు జనతాదళ్‌లో చేరారు. కరోనా మహమ్మారి కట్టడికి విశేషంగా కృషి చేసిన ఆయన, చివరికి దాని బారినే పడి మృతి చెందడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ప్రదీప్ మృతికి గవర్నర్ గణేషిలాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తదితరులు సంతాపం తెలిపారు.