విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం ఈ నెల 16న: కేశినేని నాని
- ఇప్పటికి రెండుసార్లు వాయిదాపడిన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం
- మరోసారి ముహూర్తం ఖరారు
- కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారన్న కేశినేని నాని
తొలుత సెప్టెంబరు 4న ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినా, చివరి నిమిషంలో వాయిదా పడింది. ఆ సమయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించారు. ఆపై సెప్టెంబరు 18న మరో ముహూర్తం నిర్ణయించినా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకడంతో అది కూడా వాయిదా వేశారు.
ఈ నేపథ్యంలోనే తాజా ముహూర్తం ఖరారు చేశారు. కాగా, అధికారిక ప్రారంభోత్సవం జరుపకపోయినా, ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్ పై రాకపోకలను ఇప్పటికే అనుమతించారు.