Corona Virus: దేశంలో లక్ష దాటిన కరోనా మృతుల సంఖ్య

COVID19 related deaths cross 1 lakh mark
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కరోనా మృతుల సంఖ్య లక్ష దాటింది. గత 24 గంటల్లో దేశంలో 79,476 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 64,73,545 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 1,069 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,00,842 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 54,27,707 మంది కోలుకున్నారు. 9,44,996 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.          
         
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 7,78,50,403 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,32,675 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News