Jr NTR: 'ఆర్ఆర్ఆర్' షూటింగుకి రాజమౌళి ప్లానింగ్ అదేనా?

Rajamouli plans to start RRR flick
  • లాక్ డౌన్ వల్ల 'ఆర్ఆర్ఆర్' షెడ్యూల్స్ అప్సెట్ 
  • ఈ నెల 5 నుంచి మళ్లీ షూటింగ్ ప్రారంభం
  • ముందుగా ఎన్టీఆర్ పై సన్నివేశాల చిత్రీకరణ    
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్.. రామ్ చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం అసలు ఈపాటికి రిలీజ్ అయిపోయేదే. అయితే, లాక్ డౌన్ వచ్చి పడడంతో ఆరు నెలల నుంచి షూటింగ్ ఆగిపోయింది. దాంతో మొత్తం షూటింగ్ షెడ్యూల్స్ అప్సెట్ అయ్యాయి. పైగా భారీ కాంబినేషన్లు కావడంతో షూటింగ్ పూర్తవడానికి చాలా సమయమే పట్టచ్చన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ చిత్రం షూటింగును ఈ నెల 5 నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తాజా సమాచారం. ఈ షెడ్యూల్ లో ముందుగా ఎన్టీఆర్ పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే, ఇప్పటికే మరో హీరో రామ్ చరణ్ కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసినప్పటికీ, ఎన్టీఆర్ టీజర్ ను మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు. దీంతో ఆ టీజర్ రిలీజ్ చేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని సన్నివేశాలను ముందుగా ఎన్టీఆర్ పై చిత్రీకరిస్తారని అంటున్నారు.      
Jr NTR
Ramcharan
Rajamouli
RRR

More Telugu News