Telugudesam: 'వైసీపీ సిద్ధాంతం ఇది' అంటూ గాంధీ జయంతి సందర్భంగా టీడీపీ కార్టూన్‌!

tdp cartoon on ycp
  • అప్పట్లో గాంధీజీ అహింసో పరమధర్మః పాటించారు
  • ఇప్పుడు వైసీపీ నేతలు హింసో పరమధర్మః పాటిస్తున్నారు
  • సర్వజన సంక్షేమ రాజ్యం కోసం కృషిచేద్దాం
గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడి ఆదర్శాలను గుర్తు చేస్తూ తెలుగు దేశం పార్టీ తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ఓ కార్టూన్‌ను పోస్ట్ చేసింది. అలాగే, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో దాడులు జరుగుతున్నాయంటూ విమర్శించింది. అప్పట్లో గాంధీజీ అహింసో పరమధర్మః నినాదంతో ముందుకు వెళ్లారని, ఇప్పుడు వైసీపీ నేతలు హింసో పరమధర్మః నినాదంతో ప్రవర్తిస్తున్నారని అందులో పేర్కొంది. వైసీపీ సిద్ధాంతం ఇదేనని చెప్పింది.


'నిస్వార్థ రాజకీయాలకు, నిష్కళంక దేశభక్తికి ప్రతిరూపాలైన గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిలు సమానత్వం కోసం, పేదల సంక్షేమం కోసం అనుక్షణం పోరాడిన ధీరులు. ఆ మహానుభావుల జయంతి సందర్భంగా వారు ఆశించిన సర్వజన సంక్షేమ రాజ్యం కోసం కృషిచేద్దాం' అని టీడీపీ మరో ట్వీట్‌లో పేర్కొంది.
Telugudesam
YSRCP
gandhi

More Telugu News