Corona Virus: దేశంలో 99,773కి చేరిన కరోనా మృతుల సంఖ్య

COVID19 tally reaches 6394069
  • గత 24 గంటల్లో దేశంలో 81,484 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 63,94,069
  • కోలుకున్న వారు 53,52,078 మంది
  • మొత్తం 7,67,17,728 కరోనా పరీక్షలు  
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో దేశంలో 81,484 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 63,94,069కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 1,095 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 99,773 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 53,52,078 మంది కోలుకున్నారు. 9,42,217 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.          
         
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 7,67,17,728 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,97,947 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID-19
India

More Telugu News