దేశంలో 99,773కి చేరిన కరోనా మృతుల సంఖ్య
- గత 24 గంటల్లో దేశంలో 81,484 మందికి కరోనా
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 63,94,069
- కోలుకున్న వారు 53,52,078 మంది
- మొత్తం 7,67,17,728 కరోనా పరీక్షలు
గత 24 గంటల సమయంలో 1,095 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 99,773 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 53,52,078 మంది కోలుకున్నారు. 9,42,217 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 7,67,17,728 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,97,947 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.