ప్రభాస్ సినిమాలో నటిస్తోందన్న వార్తలపై అనుష్క స్పందన
- 'ఆదిపురుష్'లో సీత పాత్ర పోషిస్తోందంటూ వార్తలు
- వట్టి పుకార్లు మాత్రమేనన్న అనుష్క
- తనను ఎవరూ సంప్రదించలేదని వ్యాఖ్య
ఇవన్నీ పుకార్లు మాత్రమేనని అనుష్క చెప్పింది. ఈ చిత్రంలో తాను నటించబోతున్నాననే రూమర్లు ఎలా మొదలయ్యాయో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. 'ఆదిపురుష్' చిత్ర బృందం ఇంతవరకు తనను సంప్రదించలేదని చెప్పింది. ఒకవేళ అంత గొప్ప పాత్రలో నటించే అవకాశం తనకు వస్తే... తానే అధికారికంగా ప్రకటిస్తానని తెలిపింది. ఇలాంటి పుకార్లను అభిమానులు నమ్మొద్దని విన్నవించింది.