హత్రాస్ ఘటనను సుమోటోగా స్వీకరించిన ఎన్ హెచ్ ఆర్సీ
- యువతిపై పాశవిక రీతిలో అత్యాచారం
- తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ యువతి మృతి
- యూపీ సర్కారు, డీజీపీకి నోటీసులు పంపిన ఎన్ హెచ్ఆర్సీ
ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన దుండగులు ఆ అభాగ్యురాలి నాలుక కోసేసి, నడుం విరగ్గొట్టి అత్యంత హేయంగా ప్రవర్తించిన వైనం అందరినీ కలచివేసింది. అత్యాచార బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో ఆ కిరాతకులపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎన్ హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసినట్టు ప్రకటించింది. ఈ ఘటనపై వివరణ కోరుతూ యూపీ సర్కారుకు, రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీ చేసింది. కాగా, మృతురాలి అంత్యక్రియలు అర్ధరాత్రి దాటిన తర్వాత హుటాహుటీన జరిపించిన నేపథ్యంలో పోలీసుల తీరుపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.