దేశంలో కొత్తగా 86,821 మందికి కరోనా

COVID19 tally crosses 63 lakh mark
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 63,12,585
  • మృతుల సంఖ్య 98,678 
  • కోలుకున్న వారు 52,73,202 మంది 
  • యాక్టివ్ కేసులు 9,40,705 
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 63 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 86,821 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 63,12,585 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 1,181 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 98,678 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 52,73,202 మంది కోలుకున్నారు. 9,40,705 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.          
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 7,56,19,781 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 14,23,052 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News