Chandrababu: యూఎన్ అవార్డు పొందిన సోనూసూద్ కు చంద్రబాబు ప్రశంసలు

Chandrababu Congrats Sonu Sood
  • లాక్ డౌన్ లో ఎంతో మందికి సాయం
  • అవార్డు ప్రకటించిన యూఎన్ఓ
  • సోనూసూద్ లాంటి వాళ్లే చేయగలరు  
లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి తన ఔదార్యంతో ఎంతో మందికి సహాయం చేసి, తాను వెండితెరపై మాత్రమే ప్రతి నాయకుడినని, నిజ జీవితంలో నాయకుడినేనని నిరూపించుకున్న సోనూ సూద్ కు, తాజాగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్) ప్రతిష్ఠాత్మక ఎస్డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ అవార్డు సోనూ సూద్ కు దక్కడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. అవార్డును పొందడంపై సోనూకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "మరింత మెరగైన ప్రపంచానికి మీ వంటి వారి అవసరం ఎంతైనా ఉంది" అని వ్యాఖ్యానించారు. ఎంతో మంది వలస కార్మికులు తమతమ స్వస్థలాలకు వెళ్లేందుకు సోనూ సూద్ సాయం చేశారు. వారి కోసం ప్రత్యేక బస్సులు,రైళ్లతో పాటు విమానాలను కూడా బుక్ చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.
Chandrababu
Sonu Sood
Award
UNO
Congrats

More Telugu News