సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Payal gives clarity about her covid test
  • ఇంజక్షన్లంటే పాయల్ కి భయమట!  
  • కొత్త దర్శకుడికి నాగ చైతన్య ఛాన్స్
  • 'ఆహా' కోసం యంగ్ హీరో ప్రాజక్టులు
*  తనకు మందులు, ఇంజక్షన్లు అంటే చిన్నప్పటి నుంచీ మహా భయమంటోంది కథానాయిక పాయల్ రాజ్ పుత్. తాజాగా షూటింగులో జాయిన్ అయిన సందర్భంగా ఈ చిన్నదానికి యూనిట్ కొవిడ్ టెస్ట్ చేయించింది. ఆ సందర్భంగా శాంపిల్ తీసుకుంటుంటే పాయల్ తెగ ఏడ్చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, దీనిపై స్పందిస్తూ, తనకు ఇంజక్షన్లు, మందులు అంటే భయమని, అందుకే అలా ఏడ్చేశానని చెప్పుకొచ్చింది. టెస్టులో ఆమెకు నెగటివ్ వచ్చిందనుకోండి!  
*  ప్రస్తుతం 'లవ్ స్టోరీ' సినిమాలో నటిస్తున్న అక్కినేని నాగ చైతన్య ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తున్నాడు. ఇటీవల జీ5లో వచ్చిన 'లూజర్' వెబ్ సీరీస్ కి దర్శకత్వం వహించిన అభిలాష్ ప్రతిభను మెచ్చి చైతన్య అతనికి ఛాన్స్ ఇస్తున్నాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పని జరుగుతోంది.
*  ఇటీవల 'భానుమతి రామకృష్ణ' చిత్రంలో నటించిన యంగ్ హీరో నవీన్ చంద్ర తాజాగా 'ఆహా' ఓటీటీ ప్లేయర్ కి మరో రెండు ప్రాజక్టులు చేయడానికి సంతకం చేశాడు. తాను నటించిన 'భానుమతి రామకృష్ణ' చిత్రం కూడా ఇటీవల 'ఆహా' ద్వారానే డైరెక్ట్ రిలీజ్ అయింది.
Go Back to Shorts
Payal Rajputh
Naga Chaitanya
Naveen Chandra

More Telugu News