కుటుంబ పెన్షన్ నిబంధనల్లో మార్పులు.. విడాకుల పిటిషన్ పెండింగ్లో ఉన్నా కుమార్తెకు పింఛన్
- ఇప్పటి వరకు విడాకులు పొందిన వారికి మాత్రమే ఈ వెసులుబాటు
- విడాకుల పిటిషన్ దాఖలు చేసినా పెన్షన్ వర్తిస్తుందన్న మంత్రి
- అడెండెంట్ అలవెన్సు రూ. 6,700కు పెంపు
విడాకులు అధికారికంగా మంజూరు కాకున్నా పెన్షన్ లబ్ధిదారులైన తల్లిదండ్రులు బతికున్న కాలంలో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసి ఉంటే సరిపోతుందని మంత్రి వివరించారు. తల్లిదండ్రుల మరణానికి ముందు దివ్యాంగులైన పిల్లలు.. తల్లిదండ్రుల మరణం తర్వాత దివ్యాంగ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే వారికి కుటుంబ పెన్షన్ లభిస్తుందన్నారు. అయితే, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మాత్రం వైకల్యం ప్రాప్తిస్తే మాత్రం ఇది వర్తించదన్నారు. కాగా, దివ్యాంగ పెన్షనర్ల సహాయకులకు ఇచ్చే అటెండెంట్ అలవెన్సును రూ. 4500 నుంచి రూ. 6700కు పెంచినట్టు జితేంద్రసింగ్ తెలిపారు.