వికారాబాద్ లో రోడ్డుపై వెళుతున్న యువతి కిడ్నాప్... నిన్న సాయంత్రం నుంచి పోలీసుల వెతుకులాట!
- నడిచి వెళుతుండగా కిడ్నాప్
- కేసును తీవ్రంగా తీసుకున్న పోలీసులు
- అనంతగిరి వైపు వెళ్లి ఉంటారని అంచనా
ఆ వెంటనే స్థానికులు సమాచారాన్ని పోలీసులకు తెలియజేయగా, ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అందుబాటులో ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ నీ పరిశీలిస్తున్నారు. దుండగులు అనంతగిరి వైపు వెళ్లి ఉంటారని భావించి, ఆ వైపు రెస్క్యూ టీమ్ లను పంపారు. దీపిక నాలుగేళ్ల క్రితం అఖిల్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుని, కొద్ది కాలానికే అతనికి దూరమైందని తెలుస్తోంది. అఖిల్ ఆమెను కిడ్నాప్ చేశాడా? అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సివుంది.