ప్రపంచంలోనే అత్యంత ఆరాధ్య వ్యక్తుల్లో పలువురు భారతీయులు!
- 42 దేశాల్లో సర్వే
- తొలి స్థానంలో బరాక్ ఒబామా
- ఇండియాలో అత్యంత ఆరాధ్యుడిగా మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ నాలుగో స్థానంలో నిలిచారని సంస్థ ప్రకటించింది. ఒబామా తరువాత మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బిల్ గేట్స్, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ లు మోదీ కన్నా ముందు ఉన్నారని పేర్కొంది. ఇదే జాబితాలో దలైలామా, వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్, పోప్ ఫ్రాన్సిస్, ఎంఎస్ ధోనీలకూ స్థానం లభించింది.
ఇక భారత్ విషయానికి వస్తే, మోదీ అగ్రస్థానంలో ఉండగా, తరువాత వరుసగా రతన్ టాటా,ఎంఎస్ ధోనీ, ఉండగా, ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తదితరుల పేర్లు కూడా ఉన్నాయి.