పడవలో పార్టీ చేసుకున్నాం... నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు: ఎన్సీబీ అధికారులతో శ్రద్ధా
- నేడు దీపిక, శ్రద్ధా, సారా అలీఖాన్ ల విచారణ
- కొంత స్పష్టంగా, కొంత అస్పష్టంగా సమాధానాలు చెప్పిన శ్రద్ధా
- కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేసిన వైనం
కాగా, విచారణ సందర్భంగా శ్రద్ధా కపూర్ కొంత స్పష్టంగా, మరికొంత అస్పష్టంగా సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం శ్రద్ధా ఏం చెప్పిందంటే... "చిచ్చోరే సినిమా సమయంలో సుశాంత్ కు చెందిన పవనా ఫాంహౌస్ కు వెళ్లాం. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి చేరుకుని భోజనం చేశారం ఆ తర్వాత సుశాంత్ కు చెందిన బోటులో పార్టీ చేసుకున్నాం. అర్ధరాత్రి వరకు అందరం పాటలు వింటూ ఆస్వాదించాం. నేను అక్కడ ఎలాంటి మాదక ద్రవ్యాలు తీసుకోలేదు" అని వివరించింది.
అయితే సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయా సాహాతో వాట్సాప్ చాట్ పై అధికారులు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేదని జాతీయ మీడియా పేర్కొంది. కాగా, దీపిక పదుకొనే సరైన రీతిలో సమాధానాలు ఇవ్వలేదని భావిస్తున్న ఎన్సీబీ అధికారులు ఆమెను మరోసారి విచారణకు పిలిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.