Visakhapatnam District: విశాఖ జిల్లా టీడీపీ కమిటీలు.. వివరాలు ఇవిగో!
- పార్లమెంటరీ కమిటీల అధ్యక్షుల ఎంపిక
- విశాఖ కమిటీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు పేరు ఖరారైనట్టు సమాచారం
- ప్రధాన కార్యదర్శిగా పట్టాభి
విశాఖ జిల్లాలోని మూడు పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీలకు అధ్యక్షులను టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీకి గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరును ఖరారు చేసినట్టు సమాచారం. ప్రధాన కార్యదర్శిగా పట్టాభిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ద్వితీయశ్రేణి నాయకత్వానికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో పట్టాభి, కాకి గోవిందరెడ్డి పేర్లు కూడా పరివీలనకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
అరకు పార్లమెంటు నియోజకవర్గ కమిటీ అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి పేరును చంద్రబాబు ఖరారు చేసినట్టు సమాచారం. అనకాపల్లి కమిటీ అధ్యక్షుడిగా బుద్ధా నాగజగదీశ్వరరావు పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే నియోజకవర్గ పరిధిలో వెలమ సామాజికవర్గం కీలకంగా ఉన్నందున వారికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.