susheela: కొవిడ్‌-19 ఇంతగా అలజడి రేపుతుందని అనుకోలేదు: బాలు మృతిపై పి.సుశీల

p susheela on balu death
  • సంగీత ప్రపంచానికి ఎనలేని సేవలందించారు
  • కరోనా వెంటాడి, వేధించి తీసుకుపోయింది
  • పెద్ద అగాధంలోకి తోసేసింది
సంగీత ప్రపంచానికి ఎనలేని సేవలందించిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని కరోనా వెంటాడి, వేధించి తీసుకుపోయిందని గాయని సుశీల అన్నారు. బాలు మృతిపై ఆమె వీడియో రూపంలో మాట్లాడారు. కొవిడ్‌-19 ఇంతగా అలజడి రేపుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహమ్మారి మనందరి ఆప్తుడయిన బాలుని తీసుకుపోయి ఒక పెద్ద అగాధంలోకి తోసేసిందని ఆమె చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా బాలు అభిమానులందర్నీ కరోనా దుఃఖంలో ముంచేసిందని చెప్పారు. బాలు మృతి తనకు వ్యక్తిగతంగా ఓ దెబ్బ అని ఆమె వ్యాఖ్యానించారు. బాలు మరణంతో కుంగిపోకుండా గుండె ధైర్యం తెచ్చుకోవాలని, ఈ విషాదం నుంచి కోలుకోవాలని ఆమె అభిమానులకు సూచించారు.  కాగా, బాలు కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరి, చివరకు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. చెన్నై శివారు ప్రాంతంలోని ఆయన ఫామ్‌హౌస్‌‌లో అంత్యక్రియలు జరుగుతున్నాయి.

susheela
SP Balasubrahmanyam
Tamilnadu

More Telugu News