Chiranjeevi: మరో జన్మ ద్వారా ఈ లోటును ఆయనే భర్తీ చేస్తారు: చిరంజీవి

Rest in peace says Balu garu says Chiranjeevi
  • సంగీత ప్రపంచానికి ఇదొక చీకటి రోజు
  • నా విజయంలో బాలుగారి పాత్ర ఎంతో ఉంది
  • ఆయన లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరు
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణ వార్తతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులందరూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ గుండె బద్దలైనట్టుగా ఉందని అన్నారు. సంగీత ప్రపంచానికి ఇదొక చీకటి రోజని చెప్పారు. బాలుగారి మరణంతో ఒక శకం ముగిసిపోయిందని అన్నారు. అద్భుతమైన స్వరంతో తనకు ఎన్నో మధురమైన పాటలను బాలు అందించారని... తన విజయంలో ఆయన పాత్ర ఎంతో ఉందని చెప్పారు.

ఘంటశాలగారికి వారసుడిగా ఎవరొస్తారని సినీ ప్రపంచం ఎదురు చూస్తున్న తరుణంలో... బాలుగారు ఒక ధ్రువతారలా దూసుకొచ్చారని చిరంజీవి అన్నారు. తన మధురమైన గానంతో భాష, సంస్కృతుల సరిహద్దులను చెరిపేశారని చెప్పారు. దశాబ్దాల పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించారని కొనియాడారు. బాలుగారి స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని, తన మరణం ద్వారా ఏర్పడిన శూన్యాన్ని పునర్జన్మ ద్వారా ఆయనే భర్తీ చేస్తారని చెప్పారు. బాలు లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Chiranjeevi
SP Balasubrahmanyam
Tollywood

More Telugu News