KCR: బాలు ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరం: సీఎం కేసీఆర్

CM KCR shocked to the demise of SP Balasubrahmanyam
  • కరోనాతో పోరాడి ఈ లోకాన్ని వీడిన ఎస్పీ బాలు
  • సినీ రంగానికి బాలు బహుముఖ సేవలందించారన్న కేసీఆర్
  • బాలు లేని లోటు తీరనిదంటూ వ్యాఖ్యలు
గానగంధర్వుడు, సినీ సంగీతాన్ని తన గాత్రంతో మరోస్థాయికి తీసుకెళ్లిన గాయక దిగ్గజం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించినా, తమ అత్యుత్తమ సేవలు అందించినా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కాపాడలేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

బాలు సినీ ప్రపంచంలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా అత్యుత్తమ రీతిలో సేవలందించారని కొనియాడారు. ఆయన మరణంతో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఈ విషాద సమయంలో బాలు కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు.
KCR
SP Balasubrahmanyam
Demise
Singer
Corona Virus

More Telugu News