SP Balasubrahmanyam: ఎస్పీ బాలు విషయంలో మా ప్రార్థనలు ఫలించలేదు: భారతీరాజా

SP Balu health condition is very critical says Bharathi Raja
  • ఆసుపత్రికి చేరుకున్న బాలు బంధువులు
  • క్యూ కడుతున్న సినీ, రాజకీయ ప్రముఖులు
  • అభిమానుల్లో తీవ్ర ఆందోళన
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమించింది. ఆసుపత్రి వద్దకు బాలు కుటుంబసభ్యులు, బంధువులు చేరుకుంటున్నారు. తమిళ సినీ దర్శకనిర్మాత భారతీరాజా కూడా ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంచలన ప్రకటన చేశారు. బాలు కోలుకోవాలని తాము చేసిన ప్రార్థనలు ఫలించలేదని అన్నారు. బాలు ఆరోగ్యం చాలా విషమంగా ఉందని... ఈ పరిస్థితుల్లో ఆయనను చూడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తమది 50 ఏళ్ల స్నేహమని చెప్పారు.

మరోవైపు బాలు ఆరోగ్యం పూర్తిగా విషమించిందని ఆయన కుమారుడు చరణ్ కి వైద్యులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాలు ఉన్న ఎంజీఎం ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు, పోలీసులు చేరుకున్నారు. దీంతో ఎలాంటి వార్తను వినాల్సి వస్తుందో అనే ఆందోళనలో అభిమానులు ఉన్నారు.
SP Balasubrahmanyam
Bharathi Raja
Tollywood
Health

More Telugu News