hemanth: వేర్వేరు కులాలు కావడంతో మా అబ్బాయిని హత్య చేశారు: హేమంత్ తల్లి

hemanth mother about honour killing in hyderabad
  • సందీప్‌, రాకేశ్‌, రంజిత్‌, యుగేంధర్‌, విజయేందర్‌ కారకులు
  • మా కుమారుడిపైనే ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచాం
  • అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు
హైదరాబాద్‌లోని చందానగర్‌ వాసి హేమంత్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిపై ఆయన తల్లి మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని సందీప్‌ రెడ్డి, రాకేశ్‌ రెడ్డి, రంజిత్ రెడ్డి, యుగేంధర్‌రెడ్డి, విజయేందర్‌ రెడ్డి అనే వ్యక్తులు హత్య చేయించారని ఆరోపించారు. తమ కుమారుడిపైనే ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచామని చెప్పారు.

తమ కొడుకు, కోడలు వేర్వేరు కులాలకు చెందిన కారణంగానే హేమంత్‌ను హత్య చేయించారని ఆమె తెలిపారు. తన కుమారుడిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గచ్చిబౌలి సమీపంలో కారులో వచ్చి తన కుమారుడు, కోడలిని దుండగులు తీసుకెళ్లారని, తమ కోడలు అందులోంచి దూకేసి వచ్చిందని ఆమె తెలిపారు. కాగా, హేమంత్ హత్య కేసులో పోలీసులు ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.
hemanth
Hyderabad
Crime News

More Telugu News