Lalu Prasad Yadav: రిమ్స్‌లో లాలూను కలిసిన ఝార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి బన్నా గుప్తా

jharkhand minister banna gupta met lalu prasad in RIMS
  • రిమ్స్‌లో చికిత్స పొందుతున్న లాలు
  • వైద్యుల కారులో వెళ్లి లాలూను కలిసిన మంత్రి
  • రాజకీయ చర్చలు నడుస్తున్నాయంటూ ఊహాగానాలు
రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆర్జేడీ ఛీప్ లాలు ప్రసాద్ యాదవ్‌ను ఝార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి బన్నాగుప్తా రహస్యంగా కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. లాలూను కలిసిన మంత్రి ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గుప్తా మాట్లాడుతూ.. లాలు ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. బ్లడ్ షుగర్ కొద్దిగా ఎక్కువ ఉందని, వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని తెలిపారు.

లాలు ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు తాను వైద్యుల కారులోనే ఆసుపత్రికి వెళ్లినట్టు చెప్పారు. లాలూను బన్నాగుప్తా కలుసుకోవడం ఇది రెండోసారి కావడంతో వీరి మధ్య రాజకీయపరమైన చర్చలు నడుస్తున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాగా, అంతకుముందు లాలుకు చికిత్స అందిస్తున్న వైద్యులను అభినందించిన మంత్రి వారిని సన్మానించారు. దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలు ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అనారోగ్యం కారణంగా రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
Lalu Prasad Yadav
Banna Gupta
Ranchi
RIMS

More Telugu News