తిరుపతిలో ప్రత్యక్షమైన గరుడ పక్షి... స్వామి మహిమేనంటున్న ప్రజలు!

Garuda in Tirupati
  • జిల్లా కోర్టు ప్రాంగణంలో అరుదైన పక్షి
  • అటవీ అధికారులకు సమాచారం
  • ఎస్వీ జూకు తరలింపు
తిరుమలలో గరుడ సేవ జరుగుతున్న రోజున, తిరుపతిలో గరుడపక్షి కనిపించడంతో ప్రజలు స్వామివారి మహిమేనని భావించారు. జిల్లా కోర్టు ఆవరణలో ఈ అరుదైన పక్షి, ఎగరలేక పడిపోయి ఉండటాన్ని పరిశీలించిన స్థానికులు సమాచారాన్ని అటవీ సిబ్బందికి చేరవేశారు. అటవీ అధికారులు వచ్చి, దీన్ని ఎస్వీ జంతు ప్రదర్శనశాలకు తరలించారు. ఈ పక్షికి వైద్యం అందిస్తామని, కోలుకున్న తరువాత, శేషాచలం అడవుల్లో వదిలేస్తామని తెలిపారు. కాగా, తిరుమలలో గరుడసేవ రోజున గరుడపక్షి తప్పనిసరిగా కనిపిస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉన్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Tirumala
Tirupati
Garuda
Eagle

More Telugu News