జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి కరోనా టీకా.. ఒక్క డోసు చాలట!
- టీకా రేసులో జాన్సన్ అండ్ జాన్సన్
- వివిధ దేశాల్లోని 60 వేల మందిపై ప్రయోగం
- తుది దశ పరీక్షలు ప్రారంభం
ప్రస్తుతం ఈ టీకా తుది దశ ప్రయోగాల్లో ఉండగా, అమెరికా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూలో మొత్తం 60 వేల మంది వలంటీర్లకు ఈ టీకా ఇవ్వనున్నారు. మంచి ఫలితం రావాలంటే ఏదైనా టీకాను కనీసం రెండుసార్లు ఇవ్వాల్సి ఉంటుందని, కానీ ఒకే ఒక్క డోసుతో కరోనా నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్‌ను తాము అభివృద్ధి చేసినట్టు జాన్సన్ అండన్ జాన్సన్ అధికారి ఒకరు తెలిపారు.