Vishnu Vardhan Reddy: కొడాలి నానిని అరెస్ట్ చేయాలి.. కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

Kodali Nani shoud be arrested demands Vishnu Vardhan Reddy
  • దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి
  • రాష్ట్రంలో ఏదో జరుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి
  • జగన్ వెంటనే స్పందించాలి
రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను చూస్తుంటే ఏదో జరుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు.

నాని మాటలను ఆయన వ్యక్తిగతమైనవిగా తాము భావించడం లేదని... ప్రభుత్వ వ్యాఖ్యలుగానే భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కొడాలి నానిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని అన్నారు. హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించాలని అన్నారు.
Vishnu Vardhan Reddy
BJP
Kodali Nani
Jagan
YSRCP

More Telugu News