Jagan: అమిత్ షాతో భేటీ అయిన జగన్

Jagan Meets Amitshah
  • ప్రారంభమైన జగన్ ఢిల్లీ పర్యటన
  • పలు అంశాలను అమిత్ షాకు వివరించిన జగన్
  • జగన్ వెంట విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. కాసేపటి క్రితం ఢిల్లీకి చేరుకున్న జగన్... తొలుత అమిత్ షా నివాసానికి వెళ్లి, ఆయనను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సి పెండింగ్ నిధులు, విభజన చట్టంలోని హామీలు, పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన నిధుల వివరాలను జగన్ వివరించినట్టు తెలుస్తోంది. రాజధాని విషయంలో హైకోర్టుకు కేంద్ర హోం శాఖ సమర్పించిన అఫిడవిట్ అంశంపై కూడా ఇరువురి మధ్య చర్చ జరుగుతున్నట్టు సమాచారం.

ఈ భేటీకి జగన్ తో పాటు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, బాలశౌరి కూడా హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లతో జగన్ సమావేశంకానున్నారు.

  • Loading...

More Telugu News