భద్రాచలం-చర్ల ప్రధాన రహదారిపై మందుపాతరలు అమర్చిన మావోలు
- కలివేరు-తేగడ గ్రామాల మధ్య మూడు మందుపాతరలు
- నిర్వీర్యం చేసిన పోలీసులు
- గంటన్నర పాటు నిలిచిపోయిన రాకపోకలు
మందుపాతరలను తొలగించిన అనంతరం పోలీసు, బాంబ్ స్క్వాడ్ బృందాలు వాటిని సమీపంలో పేల్చివేశాయి. రేపటి నుంచి ఈ నెల 27 వరకు మావోయిస్టు పార్టీ 16వ ఆవిర్భావ వారోత్సవాలు జరగనున్న సందర్భంగానే వీటిని ఏర్పాటు చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.