ప్రశాంత్ నీల్ చిత్రంలో మాఫియా డాన్ పాత్రలో ఎన్టీఆర్?

NTR to play mafia don
  • ప్రశాంత్ నీల్ చిత్రానికి కథ సిద్ధం 
  • బయోవార్ నేపథ్యంలో సాగే సినిమా
  • సరికొత్త మేకోవర్ తో ఎన్టీఆర్ గెటప్  
  • త్రివిక్రమ్ సినిమా తర్వాత సెట్స్ కి  
ఆమధ్య వచ్చిన 'కేజీఎఫ్' చిత్రంతో ఒక్కసారిగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. అతని శైలి చూసి, అతనితో సినిమాలు చేయాలని చాలామంది హీరోలు కోరుకున్నారు. ఈ కోవలో టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, ప్రభాస్ పేర్లు కూడా వినిపించాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ తో ప్రాజక్టు గురించి ప్రత్యేకంగా హైదరాబాదు వచ్చిమరీ ప్రశాంత్ చర్చలు జరిపాడు. అతను చెప్పిన కథను ఎన్టీఆర్ కూడా ఓకే చేసేశాడని వార్తలొచ్చాయి.

ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో రూపొందే చిత్రం ఎలాంటి థీమ్ తో సాగుతుందన్న అంశంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సమాచారాన్ని బట్టి, ఈ చిత్రం బయోవార్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ మాఫియా డాన్ పాత్రలో సరికొత్త మేకోవర్ తో కనిపిస్తాడని అంటున్నారు. ఈ గెటప్ కు సంబంధించి వర్క్ కూడా చేస్తున్నారట.

ఇదిలావుంచితే, ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. దాని షూటింగ్ ఇంకా మిగిలివుంది. మరికొన్నాళ్లలో ఆ షూటింగును మొదలెడతారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తాడు. ఇక అది చివరి దశలో వుండగా ప్రశాంత్ నీల్ సినిమా మొదలవుతుందని తెలుస్తోంది.    
Go Back to Shorts
Jr NTR
Prashanth Neil
KGF
Trivikram Srinivas

More Telugu News