India: ఇండియాలో క్రమంగా పెరుగుతున్న కరోనా రోజువారీ మరణాలు!

India Corona Cases above 52 Lakhs
  • గడచిన 24 గంటల్లో 96 వేలకు పైగా కేసులు
  • 52 లక్షలు దాటిన మొత్తం కేసుల సంఖ్య
  • 10.17 లక్షల మందికి పైగా చికిత్సలో
ఇండియాలో పెరుగుతున్న రోజువారీ కేసులతో సమానంగానే మరణాలు కూడా పెరుగుతున్నాయి. గత నెలాఖరు వరకూ రోజూ 800 నుంచి 900 మధ్య ఉన్న మరణాలు, ఆపై క్రమంగా రోజుకు 1000 దాటేశాయి. తాజాగా, గురువారం నాడు 1,174 మంది వ్యాధితో మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 96,424 కేసులు నమోదయ్యాయని, మొత్తం కేసుల సంఖ్య 52 లక్షలను దాటిందని పేర్కొంది.

మొత్తం కేసులు 52,14,678 కాగా, 10,17,754 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగతా వారు డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇంతవరకూ ఇండియాలో 84,372 మంది మరణించారు.
India
Corona Virus
New Cases

More Telugu News