‘చలో అమలాపురం’ పిలుపు.. సోము వీర్రాజు సహా బీజేపీ నేతల హౌస్ అరెస్ట్

AP BJP leaders house arrested
  • అంతర్వేది వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ నేతలు
  • అమలాపురంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు
  • బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్న వైనం
రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ అంతర్వేదికి వెళ్లేందుకు బీజేపీ నేడు ‘చలో అమలాపురం’కి పిలుపునిచ్చింది. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని ప్రాంతాల నేతలు ఈ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చింది. పార్టీ పిలుపు మేరకు నిన్న సాయంత్రమే రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి నేతలు వాహనాల్లో బయలుదేరారు.

 దీంతో అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలు, అనుబంధ మోర్చా నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అమలాపురంలో సెక్షన్ 30, 144 విధించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును విజయవాడలో గృహ నిర్బంధం చేశారు. మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను గుంటూరులో ఆయన నివాసంలో, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.విష్ణుకుమార్ రాజును విశాఖపట్టణంలో పోలీసులు నిన్న హౌస్ అరెస్ట్ చేశారు.
Go Back to Shorts
BJP
Somi veerraju
Andhra Pradesh
Andtarvedi
amalapuram
house arrest

More Telugu News