Vishnu Vardhan Reddy: వైసీపీతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాం: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

YSRCP govt is creating differences between religions says Vishnu Vardhan Reddy
  • దుర్గ గుడి ఘటనకు టీడీపీకి ఏం సంబంధం?
  • వైసీపీ ప్రభుత్వంలో సింహాలు మాయమయ్యాయి
  • మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నారు
రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రేపు ఛలో అమలాపురం కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని చెప్పారు. దుర్గగుడి రథంపైనున్న సింహాలు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాయమయ్యాయని... దీనికి గత టీడీపీ ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి తాము సిద్ధమవుతున్నామని విష్ణు చెప్పారు. మతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో కార్యాచరణను సిద్దం చేస్తున్నామని చెప్పారు.
Vishnu Vardhan Reddy
BJP
YSRCP
Telugudesam
Durga Temple
Antarvedi

More Telugu News