China: కరోనాపై సంచలన ప్రకటన చేసిన చైనా శాస్త్రవేత్త ట్విట్టర్ ఖాతా సస్పెన్షన్!

Li meng Yan left China
  • కరోనా చైనా ల్యాబ్ లోనే పుట్టిందన్న లీ మెంగ్ యాన్
  • ఆమె ఖాతాను సస్పెండ్  చేసిన ట్విట్టర్
  • కారణాలు వెల్లడించని ట్విట్టర్
కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది అని అడిగితే... చైనా అంటూ చిన్న పిల్లాడు కూడా టక్కుమని సమాధానం చెబుతాడు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే కరోనాను డైరెక్ట్ గా చైనా వైరస్ అని పిలుస్తుంటారు. అయితే, చైనా మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోదు.

అయితే చైనాకు చెందిన మహిళా సైంటిస్ట్ లీ మెంగ్ యాన్ తాజాగా చేసిన ఓ ప్రకటన సంచలనం రేకెత్తించింది. కరోనా వైరస్ తమ ల్యాబ్ లోనే పుట్టిందని ఆమె ప్రకటించారు. దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఆమె ఈ ప్రకటన చేయడానికి ముందే అమెరికాకు వెళ్లిపోయారు.  

మరోవైపు ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ తాజాగా ఆమెకు షాక్ ఇచ్చింది. తమ నిబంధనను ఉల్లంఘించినందుకు ఆమె అకౌంట్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఆమె అకౌంట్ లో ప్రస్తుతం ఈ సందేశమే  కనిపిస్తోంది. అయితే ఆమె పెట్టిన ఏ ట్వీట్ తమ నిబంధనలను అతిక్రమించిందో ట్విట్టర్ తెలపలేదు.
China
Li Meng Yan
Corona Virus
Twitter

More Telugu News