Sushant Singh Rajput: తనను చంపేస్తారని సుశాంత్‌ భయాందోళనలకు గురయ్యాడు: మిత్రుడు సిద్ధార్థ్

cbi probe on sushant case
  • సీబీఐకి తెలిపిన సుశాంత్ మిత్రుడు సిద్ధార్థ్‌ 
  • మాజీ మేనేజర్‌ దిశా ఆత్మహత్యతో భయపడ్డ సుశాంత్‌
  • భద్రత పెంచుకోవాలని భావించిన హీరో

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ మృతి కేసు విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా పలువురుని అధికారులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా సుశాంత్‌ స్నేహితుడు సిద్దార్థ్‌ పితానిని కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు ప్రశ్నించగా పలు కీలక విషయాలు వెల్లడించాడు. సుశాంత్‌ మృతి చెందడానికి ముందు పలు ఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన అన్నాడు. సుశాంత్‌ మృతికి కొన్ని రోజుల ముందు ఆయన మాజీ మేనేజర్‌ దిశా ఆత్మహత్యకు పాల్పడడంతో సుశాంత్ చాలా భయపడ్డాడని సిద్ధార్థ్ తెలిపాడు.  

తనను చంపేస్తారని సుశాంత్‌ పదే పదే తనకి చెప్పి ఆందోళన చెందేవాడని అన్నాడు. మరింత భద్రతను పెంచుకోవాలని తాను భావిస్తున్నట్లు సుశాంత్ చెప్పాడని తెలిపాడు. అంతేగాక, మరిన్ని విషయాలను కూడా ఆయన సీబీఐ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. కాగా, సుశాంత్‌ సింగ్ ల్యాప్‌టాప్‌ తో పాటు హార్డ్‌డ్రైవ్‌ను ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి తీసుకువెళ్లిందని కూడా ఆయన అధికారులకు చెప్పినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News