COVID-19: సినీ నటుడు అల్లు అర్జున్ కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులకు ఫిర్యాదు

Complaint against Tollywood actor Allu Arjun in Adilabad
  • నిబంధనలు ఉల్లంఘించి కుంటాల జలపాతాన్ని సందర్శించారు
  • అనుమతులు లేకున్నా షూటింగ్ చేశారన్న ఫిర్యాదుదారు
  • ప్రాథమిక విచారణ తర్వాత కేసు నమోదు చేస్తామన్న పోలీసులు
సినీ నటుడు అల్లు అర్జున్‌పై ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కరోనా నేపథ్యంలో కుంటాల జలపాతం సందర్శనను అధికారులు నిలిపివేసినప్పటికీ అల్లు అర్జున్‌తోపాటు పుష్ప సినిమా యూనిట్ నిబంధనలు ఉల్లంఘించి జలపాతాన్ని సందర్శించిందని, అంతేకాక, తిప్పేశ్వర్‌లో అనుమతులు లేకుండానే షూటింగ్ చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తీక్‌రాజు పేర్కొన్నారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించినప్పటికీ, ప్రాథమిక విచారణ తర్వాత మాత్రమే కేసు నమోదు చేస్తామని తెలిపారు.
COVID-19
Tollywood
Allu Arjun
Kuntala water fall
Pushpa

More Telugu News