82 ఏళ్ల వయసులో హీరో విశాల్ తండ్రి ఫిట్ నెస్ చూస్తే 'వావ్' అనాల్సిందే!
- ఇటీవలే కరోనాను జయించిన విశాల్ తండ్రి జీకే రెడ్డి
- తన ఫిట్ నెస్ సీక్రెట్ వెల్లడించిన జీకే
- సోషల్ మీడియాలో సందడి చేస్తున్న వీడియో
కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున బయటికి వెళ్లే పరిస్థితి లేదని, అయితే ఇంట్లో ఉండి కూడా ఫిట్ నెస్ పెంపొందించుకోవచ్చని అన్నారు. తేలికపాటి వ్యాయామాలు కూడా ఆరోగ్యంగా ఉంచుతాయని, క్రమం తప్పకుండా చేస్తే ఏ వయసులో అయినా ఫిట్ గా ఉండొచ్చని స్పష్టం చేశారు. జీకే రెడ్డి పోస్టు చేసిన ఫిట్ నెస్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సందడి చేస్తోంది.