Sri Reddy: భద్రత కల్పించండి.. టాలీవుడ్ లో డ్రగ్స్ వాడే వారి పేర్లు చెపుతా: శ్రీరెడ్డి

Many Tollywood celebrities use drugs says Sri Reddy
  • టాలీవుడ్ లో చాలా మంది డ్రగ్స్ తీసుకుంటారు
  • సెలబ్రిటీలు రేవ్ పార్టీలను నిర్వహిస్తుంటారు 
  • అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి వాడుకుంటారు
  • వీడియో ద్వారా ఆరోపించిన శ్రీ రెడ్డి
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సినీ నటి శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ ను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా శ్రీరెడ్డి ఒక వీడియో విడుదల చేసింది. ఈ  వీడియోలో ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది.  

టాలీవుడ్ లో సైతం చాలా మంది డ్రగ్స్ తీసుకుంటారని శ్రీరెడ్డి ఆరోపించింది. చాలా మంది సెలబ్రిటీలు రేవ్ పార్టీలను నిర్వహిస్తుంటారని చెప్పింది. పెద్దపెద్ద హోటల్స్ లో కూడా పార్టీలు ఏర్పాటు చేసుకుంటారని, వీటిలో డ్రగ్స్ తీసుకుంటారని తెలిపింది. అంతేకాదు ఈ పార్టీలకు వచ్చే అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి, వారిని వాడుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు భద్రత కల్పిస్తే... టాలీవుడ్ లో డ్రగ్స్ తీసుకునే వారి పేర్లను బయటపెడతానని చెప్పింది.
Sri Reddy
Rakul Preet Singh
Tollywood
Drugs

More Telugu News