శ్రీశైలంలోని ఘంటామఠం ప్రాంగణంలో లభ్యమైన పురాతన తామ్రశాసనాలు, వెండినాణేలు
- శివాలయ పునరుద్ధరణ పనులు చేస్తుండగా బయటపడిన వైనం
- తామ్రపత్రాలపై నాగరి, కన్నడ లిపి
- వెండి నాణేలు బ్రిటిష్ కాలం నాటివిగా గుర్తింపు
దేవస్థానం ఈవో రామారావు, తహసీల్దారు రాజేంద్రసింగ్, ఎస్సై హరిప్రసాద్‌లు ఆలయానికి చేరుకుని వాటిని పరిశీలించారు. వెండినాణేలను 1800-1900 సంవత్సరాల మధ్య బ్రిటిష్ పాలన నాటివిగా అధికారులు గుర్తించారు. తామ్ర పత్రాలకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.