PK Krishnadas: తెలంగాణ బీజేపీలో కరోనా కలకలం... రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కృష్ణదాస్ కు పాజిటివ్

BJP Telangana affairs In charge PK Krishnadas tested corona positive
  • కరోనా బారినపడిన కృష్ణదాస్
  • నిన్న కృష్ణదాస్ తో సమావేశమైన బండి సంజయ్
  • హోం ఐసోలేషన్ లోకి వెళ్లిన తెలంగాణ బీజేపీ చీఫ్
తెలంగాణ బీజేపీలో కరోనా కలకలం రేగింది. రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి పీకే కృష్ణదాస్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు వెల్లడైంది. కృష్ణదాస్ కు కరోనా అని తెలియడంతో తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్వీయ నిర్బంధం విధించుకున్నారు.

బండి సంజయ్ నిన్న కృష్ణదాస్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత కృష్ణదాస్ కు కరోనా పాజిటివ్ అంటూ మెడికల్ రిపోర్టు వచ్చింది. దాంతో, బండి సంజయ్ 5 రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉండాలని నిర్ణయించారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. నాలుగు రోజుల కిందట ఢిల్లీ వెళ్లినప్పుడు కరోనా టెస్టులు చేయించుకుంటే నెగెటివ్ వచ్చిందని వెల్లడించారు.

ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడంతో తన పరిస్థితిని వివరిస్తూ బండి సంజయ్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు సమాచారం అందించారు. ఇప్పటికే తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డారు.
PK Krishnadas
Corona Virus
Positive
Bandi Sanjay
BJP
Telangana

More Telugu News