Kangana Ranaut: మహేశ్ భట్ తో కంగన ఉన్న పిక్ ను పోస్ట్ చేస్తూ, రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు!

Rakhi Sawant Shared Mahesh Bhat and Kangana pic
  • గతంలో మహేశ్ భట్ పక్కనే కంగన
  • కొత్త కోణాన్ని చూడాలంటూ రాఖీ వ్యాఖ్యలు
  • వైరల్ అవుతున్న పిక్
"సుశాంత్ కే కేస్ మే నయా మోడ్ ఆయా" (సుశాంత్ కేసులో కొత్త కోణం వచ్చింది) అంటూ నటి రాఖీ సావంత్ పోస్ట్ చేసిన పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మహేశ్ భట్ పక్కన కంగన కూర్చుని ఉంది. ఈ పిక్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో రాఖీ పోస్ట్ చేసి, ఈ కొత్త కోణాన్ని చూడాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

కాగా, ముంబై నగరం పీఓకేలా ఉందని కంగన వ్యాఖ్యానించిన తరువాత తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కంగనపై ప్రతీకార చర్యలకు దిగుతోందని ఆరోపణలు కూడా వచ్చాయి. కంగన కూడా ఏ మాత్రమూ తగ్గకుండా, వీలు చిక్కినప్పుడల్లా సీఎం ఉద్ధవ్ థాకరే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తూనే ఉంది.
Kangana Ranaut
Mahesh Bhat
Rakhisawant

More Telugu News