బిస్కెట్లు తిన్న మరో చిన్నారి మృతి.. కర్నూలు జిల్లాలో విషాదం
- ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నెలో ఘటన
- బిస్కెట్లు టీలో ముంచుకుని తిన్నవెంటనే కుప్పకూలిన చిన్నారులు
- ఒక రోజు వ్యవధిలో ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు
అప్పటికే హుసేన్‌బాషా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. హుసేన్ బీ, జమాల్ బీ పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న హుసేన్ బీ ఈ ఉదయం కన్నుమూసింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు ఇద్దరినీ కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, ఫుడ్ పాయిజన్ కారణంగానే కాగానే పిల్లలు మృతి చెందినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని, ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్టు తహసీల్దార్ తెలిపారు.