Corona Virus: దేశంలో కరోనా కేసుల అప్‌డేట్స్‌

India COVID19 case tally crosses 49lakh mark
  • 24 గంటల్లో దేశంలో 83,809 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 49,30,237
  • మృతుల సంఖ్య మొత్తం 80,776
  • కోలుకున్న వారు 38,59,400 మంది  
భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 83,809 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49,30,237 కు చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 1,054 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 80,776కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 38,59,400 మంది కోలుకున్నారు. 9,90,061 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.  
                           
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 5,83,12,273 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,72,845 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID-19
India

More Telugu News