KCR: చినజీయర్ స్వామిని పరామర్శించిన కేసీఆర్

KCR Meets China Jeeyer
  • శుక్రవారం తుదిశ్వాస విడిచిన చినజీయర్ తల్లి
  • శనివారం జరిగిన అంత్యక్రియలు
  • చినజీయర్ ఆశ్రమానికి వెళ్లిన కేసీఆర్
చినజీయర్ స్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పరామర్శించారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ లో ఉన్న చినజీయర్ ఆశ్రమానికి కేసీఆర్ వెళ్లారు. చినజీయర్ స్వామికి మాతృవియోగం కలిగిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి  10 గంటల సమయంలో ఆయన తల్లి మంగతాయారు (85) తుదిశ్వాస విడిచారు. వయసు మీరడంతో పాటు, గత కొంత కాలంగా అమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఆమెకు అత్యక్రియలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో చినజీయర్ స్వామిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి  జగన్ తదితరులు ఫోన్ ద్వారా పరామర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా ఆశ్రమానికి వెళ్లి పరామర్శించారు.
KCR
TRS
China Jeeyer

More Telugu News