YSRCP: కాకినాడ, రాజమహేంద్రవరంలను కలిపి జంటనగరాలుగా అభివృద్ధి చేయాలి: లోక్‌సభలో వైసీపీ ఎంపీ మార్గాని భరత్

margani speak about rajamahendravaram
  • ఆ ప్రాంతాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించాలి
  • మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు చేపట్టాలి
  • రాజమహేంద్రవరం చారిత్రక ప్రాధాన్యమున్న నగరం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం గురించి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ లోక్‌సభలో‌ ప్రస్తావించారు. ఆ ప్రాంతాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించాలని కోరారు. మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. రాజమహేంద్రవరం చారిత్రక ప్రాధాన్యమున్న నగరమని గుర్తుచేశారు.  

పర్యాటక, విద్య, ఆరోగ్య కేంద్రంగా మారేందుకు ఆ నగరానికి అర్హతలన్నీ ఉన్నాయని, అక్కడ ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులూ నిర్మించాలని చెప్పారు. ఇటీవల మరో 21 పంచాయతీలు అందులో కలిశాయని తెలిపారు. కాకినాడతో కలిపి రాజమహేంద్రవరాన్ని జంటనగరాలుగా అభివృద్ధి చేయాలని కోరారు.
YSRCP
Parliament
Lok Sabha

More Telugu News