NCB: రకుల్, సారా... మా అందరినీ క్షమించండి: సమంత

Samantha Says We are Sorry Rakul
  • డ్రగ్స్ కేసులో రకుల్ పేరున్నట్టు వార్తలు
  • తీవ్రంగా విమర్శలు గుప్పించిన నెటిజన్లు
  • తాజాగా ఎవరి పేరూ లేదని స్పష్టం చేసిన ఎన్సీబీ
  • అభిమానుల తరఫున సారీ చెప్పిన సమంత
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తరువాత తెరపైకి వచ్చిన డ్రగ్స్ కేసులో దాదాపు 25 మంది సినిమా తారలకు ప్రమేయం ఉందని, వారిలో హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ లు కూడా ఉన్నారని వచ్చిన వార్తలు తీవ్ర కలకలం రేపగా, వారిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో దర్యాఫ్తు చేస్తున్న ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా, తాజాగా వివరణ ఇస్తూ, మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్ సెలబ్రిటీల జాబితా తమ వద్ద ఏమీ లేదని స్పష్టం చేశారు. తాము కేవలం డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారి పేర్లను తయారు చేశామని, ఇవన్నీ నటీనటుల పేర్లని తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.

దీంతో అంతవరకూ రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ లపై విమర్శలు కురిపించిన నెటిజన్లు, తమ తప్పు తెలుసుకుని 'సారీ' మెసేజ్ లు పెడుతున్నారు. ఈ క్రమంలో అందరు అభిమానుల తరఫున సమంత అక్కినేని, వారిద్దరికీ క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను పెట్టింది. 'సారీ రకుల్' అన్న హ్యాష్ ట్యాగ్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.
NCB
Samantha
Rakul Preet Singh
Sorry
Drugs

More Telugu News