Suma: 'మై డియర్ రాజా' అంటూ సుమ ట్వీట్!

Anchor Suma tweet going viral
  • తన భర్తను ఉద్దేశిస్తూ సుమ ట్వీట్
  • ఎప్పటికీ నా సంతోషం నీవే అని వ్యాఖ్య
  • అభిమానులను అలరిస్తున్న ట్వీట్
తన భర్త రాజీవ్ కనకాల గురించి యాంకర్ సుమ చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. భర్తపై తనకున్న ప్రేమాభిమానాలను  ఒక్క ముక్కలో ఆమె చాలా స్పష్టంగా  వెల్లడించింది. 'మై డియర్ రాజా... ఎప్పటికీ నా సంతోషం నీవే' అని ఆమె ట్వీట్ చేశారు. తన భర్త చేతిని పట్టుకుని, ఆయన భుజంపై తలవాల్చిన ఫొటోను షేర్ చేశారు. ఈ ట్వీట్ పట్ల నెటిజన్లు తమ సంతోషాన్ని ప్రారంభించారు.

మరోవైపు రాజీవ్ కనకాల, సుమ విడిపోయినట్టు ఇటీవలి కాలంలో పుకార్లు వచ్చాయి. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారమయ్యాయి. అయితే ఈ మధ్య జరిగిన ఓ కార్యక్రమం ద్వారా అలాంటిదేమీ లేదనే విషయం నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో, తమ అనుబంధం ఎంత గొప్పదో చెపుతూ సుమ చేసిన ట్వీట్ అభిమానులను అలరిస్తోంది.
Suma
Anchor
Rajiv Kanakala
Tollywood

More Telugu News