Vijayasai Reddy: చంద్రబాబుగారు మీరు ఇలాగే చేస్తూ పోతే జనాలు మీకు శాశ్వతంగా చెక్ పెడతారు: విజయసాయిరెడ్డి

Chandrababu trying to disturb all schemes says Vijayasai Reddy
  • ప్రతి పథకాన్ని చంద్రబాబు అడ్డుకోవాలని చూస్తున్నారు
  • చంద్రబాబుది వృథా ప్రయాస
  • జగన్ సంకల్పం ముందు చంద్రబాబు ఆటంకాలు పనిచేయవు
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. అయితే, ఏ పథకం పెట్టినా అడ్డుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. కానీ, చంద్రబాబుది వృథా ప్రయాస అని... ముఖ్యమంత్రి జగన్ సంకల్పం ముందు ఈయన ఆటంకాలేవీ పని చేయవని అన్నారు. 'చంద్రబాబుగారు, మీరు ఇలాగే చేస్తూ పోతే ప్రజలు మీకు శాశ్వతంగా చెక్ పెట్టి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తార'ని అన్నారు.
Vijayasai Reddy
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News